Jagan: డిసెంబరు నుంచి వైయస్ఆర్సీపీ ఉద్యమ బాట..! 18 d ago
డిసెంబరు నుంచి వైయస్ఆర్సీపీ ఉద్యమ బాట పడుతున్నట్లు మాజీ సీఎం జగన్ తెలిపారు. డిసెంబరు 11న రైతుల తరపున వారి సమస్యల పరిష్కారానికి.. ర్యాలీగా వెళ్లి అన్ని జిల్లాల కలెక్టర్లకి వినతిపత్రం అందజేస్తామని వైయస్ జగన్ తెలిపారు. కరెంట్ ఛార్జీల బాదుడే బాదుడుపై డిసెంబరు 27న ప్రజలతో కలిసి ర్యాలీగా వెళ్లి.. పెంచిన ఛార్జీలను తగ్గించమని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల ఎస్ఈ, సీఎండీ కార్యాలయాల్లో వినతిపత్రం అందజేస్తామని అన్నారు. జనవరి 3న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతిపత్రం అందజేస్తామని జగన్ పేర్కొన్నారు.